పోలీసులూ.. వ్యతిరేక భావనను తొలగించండి

ABN , First Publish Date - 2021-08-01T07:42:14+05:30 IST

ప్రజల్లో పోలీసుల పట్ల వ్యతిరేక భావనను తొలగించాలని యువ ఐపీఎ్‌సలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

పోలీసులూ.. వ్యతిరేక భావనను తొలగించండి

ఐపీఎస్‌ ప్రొబేషనరీలతో ప్రధాని మోదీ

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్రజల్లో పోలీసుల పట్ల వ్యతిరేక భావనను తొలగించాలని యువ ఐపీఎ్‌సలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా, పండుగల సమయం లో కష్టపడినా పోలీసుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పోవడం లే దని, యువ ఐపీఎస్‌లు ఆ దిశగా కృషి చేయాలని సూచిం చారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 73వ బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐపీఎ్‌సలను ఉద్దేశించి శనివారం ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘25 ఏళ్ల తర్వాత 2047లో దేశం 100వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోనుంది. దేశాభివృద్ధి మీ చేతుల్లోనే ఉంటుంది. 1930-47 మధ్య కాలంలో స్వరాజ్యం కోసం యావత్‌దేశ యువత ఏకతాటిపైకి వచ్చింది. ఇప్పుడు మీరంతా సురాజ్యం కోసం కృషి చేయాలి. ఐక్య భారత్‌.. శ్రేష్ట భారత్‌ కోసం పాటుబడాలి. దీనికి మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు’’ అన్నారు. సైబర్‌, ఆర్థిక నేరాలు సవాలు విసురుతున్నాయని.. యువ ఐపీఎ్‌సలు వాటికి వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలన్నారు. మహిళల భాగస్వామ్యం పెరగడంతో దేశంలో పోలీసింగ్‌ బలోపేతమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలతో స్నేహం గా ఉంటూ యూనిఫాం గౌరవాన్ని కాపాడాలని సూచించా రు. దేశంలో నక్సలిజానికి చెక్‌పెట్టామని, ఒకప్పటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ అభివృద్ధిని యువ ఐపీఎ్‌సలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. 


తెలుగు ప్రొబేషనరీకి అభినందన

అంతకు ముందు ప్రధాని 8 మంది ప్రొబేషనరీ ఐపీఎ్‌సలతో మాట్లాడారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన శివకిశోర్‌ వీరిలో ఉన్నారు. తాను ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో పైనాన్షియల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసినట్లు శివకిశోర్‌ చెప్పారు. ఐపీఎ్‌సకు ఎంపిక కావడానికి ముందు నాలుగేళ్లపాటు కృత్రిమ మేధ(ఏఐ)పై ఓ కంపెనీలో పనిచేశానన్నారు. సైబర్‌, ఆర్థిక నేరాలను ఎలా అడ్డుకట్ట వేస్తారు? అని మోదీ ప్రశ్నించగా.. ‘‘టెక్నాలజీ ద్వారా ఈ తరహా నేరాల ను అదుపులోకి తేవొచ్చు. కర్నూల్‌లో క్షేత్రస్థాయి శిక్షణలో ఇలాంటి ఎన్నో కేసులను పరిష్కరించాను. ఈ తరహా నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకం’’ అని వివరించారు. దీనికి ప్రధాని సంతృప్తి చెందుతూ శివకిశోర్‌ను అభినంధించారు. 


178 ప్రొబేషనరీ ఐపీఎస్‌లు

జాతీయ పోలీసు అకాడమీలో ఈ నెల 6న.. 178 మంది ప్రొబేషనరీ ఐపీఎ్‌సల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరగనుంది. అందులో 33 మంది మహిళలు ఉన్నారు. 34 మంది నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, మారిషస్‌ దేశాలకు చెందిన ప్రొబేషనర్లు ఉన్నారు. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ హాజరుకానున్నారు.

Updated Date - 2021-08-01T07:42:14+05:30 IST