కట్టడికి ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-05-07T10:28:12+05:30 IST

కరోనా ఉధృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. వైరస్‌ తీవ్రత, కట్టడికి

కట్టడికి ఏం చేస్తున్నారు?

తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌ 


అమరావతి (ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ, మే 6: కరోనా ఉధృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. వైరస్‌ తీవ్రత, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. వ్యాక్సిన్‌ పంపిణీ తీరు, ఆక్సిజన్‌ కొరత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామని, బాధితులకు సంపూర్ణ వైద్య సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధానికి సీఎం జగన్‌ వివరించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతతో పాటు కట్టడి చర్యలపై ఇరువురూ చర్చించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. కాగా, కొవిడ్‌ పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఒడి శా, జార్ఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్ము-కశ్మీర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్లతోనూ మోదీ ఫో న్‌లో చర్చించారని పీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. 

టీకా ప్రక్రియ వేగవంతం: ప్రధాని

వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ గురువారం సమీక్షించారు.


టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే కొద్ది నెలల్లో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ప్రణాళికపైనా ఈ సమావేశంలో చర్చించారు. 45ఏళ్లు పైబడిన వారిలో 31శాతం మందికి తొలి డోసు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేశామన్నారు. కేంద్రమంత్రు లు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామ న్‌, హర్షవర్ధన్‌, పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు. 

Updated Date - 2021-05-07T10:28:12+05:30 IST