Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల ఆలనా పాలనకు ప్రాధాన్యం

జెండా ఊపి బాల రక్షక్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ 

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 6 : పిల్లల ఆలనా పాలనకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, పిల్లలు అంతా బాల్యాన్ని అనుభవిస్తూ ఎదిగేందు కు అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ హరి చందన పేర్కొన్నారు. స్ర్తీ, శిక్షు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు కేటాయించిన బాల రక్షక్‌ వాహనా న్ని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అందరి బాగోగులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఇందుకు సమగ్ర శిక్ష శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు ఆపదలో ఉన్నా వారికి ఏ అవసరం వచ్చినా, అనాధ పిల్లల రక్షణ కు 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేస్తే చైల్డ్‌ సి బ్బంది తక్షణమే ఆ పిల్లలు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారికి సాయం అందిస్తారన్నారు. అప్పు డే పుట్టిన శిశువులను రోడ్డుపై వదిలేసిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన, పిల్లల ద్వా రా వెట్టి చేయించిన ఎలాంటి సమాచారమైన 1098కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్ర మంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ అశోక్‌, డీసీపీవో కుసు మలత పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాల ని కలెక్టర్‌ హరిచందన కోరారు. గతనెల 29న నల్గొండలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థులను సోమవారం కలెక్టర్‌ పూలమాలతో సత్కరించి మెడల్స్‌ అం దించి అభినందించారు. జిల్లాలోని జక్లేర్‌కు చెంది అంబరీష్‌ రెజ్లింగ్‌లో బంగారు పతకం, ధన్వాడ కేజీబీవీకి చెందిన జ్యోతి వెండి పతకం సాధించా రు. అలాగే ఇమాన్యూల్‌, గణేష్‌, వెంకటేష్‌, ప్రశాం త్‌, మౌనిక, వరలక్ష్మీ, రజిత, నాగలక్ష్మీ  రజత పతకాన్ని సాధించారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్‌, జీహెచ్‌ఎం రమేష్‌, ప్రకాష్‌, శ్రీని వాస్‌, రామ్‌ కళ్యాణ్‌, పీఈటీ ఆంజనేయులు, కోచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Advertisement
Advertisement