విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-29T04:36:45+05:30 IST

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
ఐసీయూ యూనిట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

షాద్‌నగర్‌/కేశంపేట, జనవరి 28: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. పట్టణం లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రూ.40లక్షలతో ఏర్పాటు చేసిన ఐసీయూ విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. షాద్‌నగర్‌లో100పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చెర్మన్‌ ఎంఎస్‌ నటరాజన్‌, ఎంపీపీ ఖాజాఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రామ్‌రెడ్డి పాల్గొన్నారు.

సరస్వతీమాత విగ్రహ ఆవిష్కరణ 

కేశంపేట మండలం కొత్తపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో 2001-02 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన సరస్వతీమాత విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ నవీన్‌కుమార్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ గణేష్‌, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లే్‌షయాదవ్‌, మురళీధర్‌రెడ్డి, జమాల్‌ఖాన్‌, జగన్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T04:36:45+05:30 IST