పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-07-25T09:32:15+05:30 IST

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడం ఆదాయపు పన్ను శాఖ అగ్ర ప్రాధాన్యమని సీబీడీటీ చైర్మన్‌గా నియమితులైన నితిన్‌ గుప్తా అన్నారు.

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారానికే  ప్రాధాన్యం

సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు సకాలంలో  పరిష్కరించడం ఆదాయపు పన్ను శాఖ అగ్ర ప్రాధాన్యమని సీబీడీటీ చైర్మన్‌గా నియమితులైన నితిన్‌ గుప్తా అన్నారు. మార్చి 31వ తేదీతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో చారిత్రక గరిష్ఠ స్థాయిలో రూ.14.09 లక్షల కోట్ల పన్నులు వసూలైనట్టు ఐటీ దినోత్సవం సందర్భంగా పంపిన ఒక సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ ఘనతతో సంతృప్తి చెంది విశ్రమించకూడదని, ఇదే జోరు కొనసాగించడం అవసరమన్నారు. పన్ను చెల్లింపుదారుల చార్టర్‌కు అనుగుణంగా వారి ఫిర్యాదులు నిజాయతీగా, సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొన్నే ళ్లుగా ఆర్థిక రంగంలో డిజిటైజేషన్‌, కొత్త వ్యాపార విభాగాలు, కొత్త ఆస్తి శ్రేణులు వంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని పెంచేందుకు, నిర్వహణలో పారదర్శకతకు కొన్ని ప్రాసె్‌సలు కూడా ప్రవేశపెట్టిందని గుప్తా అన్నారు.

Updated Date - 2022-07-25T09:32:15+05:30 IST