కాలనీల సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-24T05:02:28+05:30 IST

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సుందరీకరణకు ప్రాధాన్యం నివ్వాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సూచించారు.

కాలనీల సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 23: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సుందరీకరణకు ప్రాధాన్యం నివ్వాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సూచించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి మంత్రాలయం నియోజకవర్గంలో చేపడుతున్న నవరత్నాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో ఇంటి నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మేటీల ద్వారా గ్రామ సభ నిర్వహించి ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డికి కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ భవన నిర్మాణాల పనులకు గ్రౌండింగ్‌ చేయాలన్నారు. అంతకు ముందు జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) ఎన్‌.మౌర్య ఇంటి నిర్మాణాలపై మండలాల వారిగా హౌసింగ్‌ ఏఈలతో సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రాలయం నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు రామసుందర్‌రెడ్డి, డా.మనజీర్‌ జిలానీ, శ్రీనివాసులు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆదోని ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-24T05:02:28+05:30 IST