ఐదేళ్ల శిక్ష పూర్తయిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించండి

ABN , First Publish Date - 2021-02-28T04:05:53+05:30 IST

క్షణి కావేశంలో నేరాలకు పాల్పడి ఐదేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఖైదీల కుటుంబాలు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరాయి.

ఐదేళ్ల శిక్ష పూర్తయిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించండి
ఎమ్మెల్యేకి బాధలు చెప్పుకుంటున్న ఖైదీల కుటుంబాలు

 రూరల్‌ ఎమ్మెల్యేను కోరిన ఖైదీల కుటుంబాలు

నెల్లూరు(జడ్పీ), ఫిబ్రవరి 27 : క్షణి కావేశంలో నేరాలకు పాల్పడి ఐదేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఖైదీల కుటుంబాలు రూరల్‌  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరాయి.  పలు కుటుంబాల వారు శనివారం ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు తమ బాధలను  తెలుపుకున్నారు. క్షణికావేశంలో తప్పులు, నేరాలు చేసి తమ బిడ్డలు, భర్తలు, తండ్రులు, అన్నలు జైలు పాలైయ్యారని, దీంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని పలువురు వృద్ధులు, మహిళలు ఎమ్మెల్యేకు విన్నవించారు.  తమ బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఐదేళ్లు శిక్షా కాలం పూర్తి అయిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించాలని కోరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఏమైనా సంఘటనలు జరిగితే చట్టాలను ఆశ్రయించాలే తప్ప, వాటిని ఉల్లంఘించి జైలు పాలైతే వారితోపాటు వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయన్న విషయాలను అందరూ గ్రహించాలన్నారు. ఖైదీల కుటుంబాల ఆవేదనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  దృష్టికి తీసుకెళ్తానని, న్యాయపరంగా ఇబ్బందులు లేకపోతే ఐదేళ్లు పూర్తి అయినవారికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతానని  తెలిపారు.


Updated Date - 2021-02-28T04:05:53+05:30 IST