ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

ABN , First Publish Date - 2021-04-11T05:35:19+05:30 IST

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని, తమనుతాము మార్చుకుని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు.

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
అంపోలు జైలును పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మాన

 శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/గార:  ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని, తమనుతాము మార్చుకుని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు. అంపోలు సమీపంలోని జిల్లా జైలును ఆయన శనివారం సందర్శించారు. జైలు ప్రాంగణంలో ఖైదీలు సాగుచేస్తున్న కూరగాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలకు అందిస్తున్న సేవలు,  సౌకర్యాలపై జైలు సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.  కొత్త జీవితానికి ఖైదీలు శ్రీకారం చుట్టాలని తెలిపారు. ఆయన వెంట డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్‌ మూకళ్ల తాతబాబు,  వరుదు విజయ్‌కుమార్‌,  గొలివి రమణమూర్తి, జైలర్లు దివాకర్‌నాయుడు, ఉదయ్‌భాస్కర్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-04-11T05:35:19+05:30 IST