వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బంధువులతో మాట్లాడిన ఖైదీలు

ABN , First Publish Date - 2020-04-10T14:12:02+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సెల్‌ఫోన్‌ వీడియో కాల్‌ ద్వారా 14 వేల మంది ఖైదీలు తమ కుటుంబీకులతో మాట్లాడారని మద్రాసు హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బంధువులతో మాట్లాడిన ఖైదీలు

  • కోర్టుకు తెలిపిన ప్రభుత్వం

చెన్నై : లాక్‌డౌన్‌ కారణంగా సెల్‌ఫోన్‌ వీడియో కాల్‌ ద్వారా 14 వేల మంది ఖైదీలు తమ కుటుంబీకులతో మాట్లాడారని మద్రాసు హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. రాష్ట్రప్రభుత్వ చర్యలకు న్యాయస్థానం అభినందించింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమ కుటుంబీకుల పరిస్థితి తెలుసుకోలేకపోతున్నా మని, తమకు బెయిల్‌ మంజూరుచేయాలంటూ కొందరు ఖైదీలు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు శివజ్ఞానం, కళ్యాణ సుందరంలు విచారించారు. 


విచారణకు ప్రభుత్వ తరపున హాజరైన నేరవిభాగ న్యాయవాది ప్రతాప్‌కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా  వ్యాధి లేదని, వారు సురక్షితంగా ఉన్నారంటూ వాదిం చారు. సుమారు 58 సెల్‌ఫోన్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఏర్పాటు చేశామని, ఈ సెల్‌ఫోన్‌ వినియోగించి వీడియో కాల్‌ ద్వారా 14,732 ఖైదీలు తమ కుటుం బీకులతో మాట్లాడారని తెలిపారు. కావున ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపడు తుందని, ఈ విషయమై ప్రతిరోజూ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారని లాయర్‌ వివరించారు. ఖైదీల కోరిక మేరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను న్యాయమూర్తులు అభినందించడంతో పాటు కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Updated Date - 2020-04-10T14:12:02+05:30 IST