Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌ మృతి

న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రాస్తారోకో

దండేపల్లి,నవంబరు 30:  మ్యాదరిపేట గ్రామానికి చెందిన మడావి లక్ష్మణ్‌(28) అనే ప్రైవేటు ఎలక్ర్టిషియన్‌ (హెల్పర్‌) గా పని చేస్తున్నాడు. మండలంలోని లింగాపూర్‌ సమీపంలో  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్‌ కిందికి దిచ్చేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు లక్ష్మణ్‌కు ఫోన్‌ చేసి పిలిపించారు. స్తంభం పైకి ఎక్కి ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు దించే క్రమంలో పైన ఉన్న  11కేవీ విద్యుత్‌ తీగలను గమనిం చలేదు. వాటికి విద్యుత్‌ సరఫరా అవుతుండడం, ఇనుప చైన్‌కు స్పార్క్‌ వచ్చి  లక్ష్మణ్‌ షాక్‌గురై అక్కడిక్కడే  మృతి చెందాడు. విద్యుత్‌ సిబ్బంది అధికారులకు సమాచారం అం దించారు. ప్రమాదం జరిగి 3 గంటలైనా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు,  ప్రజాప్రతినిధులు, ఆదివాసి నాయకులు లింగాపూర్‌ ప్రధాన రహదారిపై  రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ కరీముల్లాఖాన్‌, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్పైలు శ్రీకాంత్‌, చంద్రశే ఖర్‌లు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, అధి కారులు రావాలని డిమాండ్‌ చేశారు. విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికా రులకు తెలుపగా న్యాయం చేస్తామ ని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్యతోపాటు మూడేళ్ల పాప ఉంది. అందరితో కలిసి మెలిసి ఉండే లక్ష్మణ్‌ ప్రమా దశాత్తు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్న ట్లు ఎస్సై పేర్కొన్నారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ

జన్నారం: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ కు గురై యువకుడు మృతిచెందిన సంఘటన వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని నర్సింగాపూర్‌లో చోటు చేసుకుంది.  మంగళవారం ఉదయం రాజు(25) ఇంటిలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా స్విచ్‌బోర్డులు సరిగ్గా లేకపోవడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.  రాజు భార్య కళా బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌  తెలిపారు. 


Advertisement
Advertisement