Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి

న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రాస్తారోకో

దండేపల్లి, నవంబరు 30: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట కు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మడావి లక్ష్మణ్‌(28) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మంగళవారం లింగాపూర్‌ సమీపంలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను కిం దించేందుకు స్తంభంపైకి ఎక్కిన లక్ష్మణ్‌.. పైన ఉన్న 11కేవీ తీగలను గమనించలేదు. విద్యుత్తు సరఫరాను కూడా నిలిపి వేయలేదు. దాంతో లక్ష్మణ్‌ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. హెల్పర్‌ మృతి చెందినా అధికారులు పట్టించుకోకపోవడంతో  కుటుంబ సభ్యులు, బంధువులు,  ఆదివాసి నాయకులు లింగాపూర్‌ ప్రధాన రహదారిపై  రాస్తారోకో చేపట్టారు. ల మృతుడికి భార్య, మూడేళ్ల పాప ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  

Advertisement
Advertisement