ఫైర్‌ అవుతారా..

ABN , First Publish Date - 2020-08-12T11:02:20+05:30 IST

విజయవాడలో కొవిడ్‌ బాధితులకు చికిత్స పేరుతో స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను ఓ కార్పొ రేట్‌ ఆసుపత్రి అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది.

ఫైర్‌ అవుతారా..

 జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు,                                         

   స్టార్‌హోటళ్లలో భద్రతపై అధికారుల అప్రమత్తం

  ఫైర్‌ సేఫ్టీ, ఇతర భద్రతా ప్రమాణాల లొసుగులు తేల్చడానికి పీసీబీ కసరత్తు

  15 కొవిడ్‌, 285 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులివ్వాలని నిర్ణయం

 పూర్తి ఆధారాలతో నివేదికలు ఇవ్వడానికి 15 రోజుల గడువు విధింపు

 కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో పది స్టార్‌ హోటళ్లకు కూడా..

 అటు కాకినాడ నగరంలో మూడు ఆసుపత్రులకు ఫైర్‌ ఎన్‌వోసీలు నిల్‌

  ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి ఫైర్‌సేఫ్టీ ఎన్‌వోసీ రెన్యువల్‌కు అగ్నిమాపకశాఖనో


(కాకినాడ-ఆంధ్రజ్యోతి):విజయవాడలో కొవిడ్‌ బాధితులకు చికిత్స పేరుతో స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను ఓ కార్పొ రేట్‌ ఆసుపత్రి అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. మొన్న ఆదివారం ఇందులో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పది మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 15 ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా విజయవాడ తరహా అగ్ని ప్రమాదాలు తలెత్తితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవికాకుండా ఇతర ప్రైవేటు ఆసుప త్రుల్లోను అగ్నిప్రమాదాల నివారణ వ్యవస్థ (ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టం) ఎలా ఉందనేది ఎవ రికీ అంతుబట్టని పరిస్థితి.


వీటి నిర్వహణను చాలా ఆసుపత్రులు పూర్తిగా గాలికి వదిలే శాయి. బయటకు ఆయా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టం బయటకు కనిపిం చినా ఆపద వస్తే పనిచేయడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వీటిలో భద్రతా పరమైన లొసుగులు, వాటి పనితీరు వంటి అంశాలపై జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు అప్రమత్తమైంది. ఆయా ఆసుపత్రుల్లో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా? ఏర్పాటుచేసిన అగ్నిప్రమాదాల నివారణ వ్యవస్థలు పనిచేస్తున్నాయా? వాటి నిర్వహణ ఎలా ఉంది? ప్రమాదం తలెత్తితే తప్పించుకునే మెట్ల మార్గాలు ఉన్నాయా? లేవా? వంటి వాటన్నింటినీ నిగ్గుతేల్చాలని నిర్ణయించింది.


ఇందుకోసం వాటన్నింటికీ నోటీసులు సిద్ధం చేసింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో జీఎస్‌ఎల్‌, కిమ్స్‌, గాంధీ, ఇనోదయ, సాయి, శ్రీలత, రాజు న్యూరో, నవీన్‌, లక్ష్మీ, అరుణ, అక్షయ, విజయసాయి, అపోలో, యూనివర్సల్‌, డెల్టా తదితర ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ ఆసు పత్రుల కింద బాధితులకు చికిత్స అందిస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు కొవిడ్‌ ఆసుపత్రులుగా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికి సోమవారం నుంచి నోటీసులు పంపుతున్నట్టు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వివ రించారు. ఇవికాకుండా 50 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు 285 గుర్తించారు. వీటికికూడా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. 


స్టార్‌ హోటళ్లలో పరిస్థితి ఏంటో?

జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలలో పది వరకు స్టార్‌ హోట ళ్లున్నాయి. వీటిలో కూడా భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేదానిపై పీసీబీ దృష్టిసారించింది. ఆపద వస్తే నియంత్రించే అగ్నిమాపక నిరోధక వ్యవస్థలు ఎలా ఉన్నాయనేదానిపై నోటీసులు జారీ చేయనుంది. అటు ఆసుపత్రులు, ఇటు హోటళ్లకు సోమవారం నుంచి నోటీసులు జారీ భద్రతా ప్రమాణాలపై నివేదికలు అందించడానికి 15 రోజులు గడువు విధించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో లోపాలను తనిఖీ చేసి జరిమానా లేదా శిక్ష విధించనున్నారు.


మరోపక్క జిల్లా అగ్నిమాపక శాఖ కూడా ఆసుపతుల్ర్లో ఎన్‌వోసీల తనిఖీ చేపట్టింది. అందులోభాగంగా కాకినాడలో మూడు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఎన్‌వోసీ లేనట్టు నిర్ధారించింది. రెండు ఆసుపత్రుల్లో అగ్నిమాపక నివారణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎన్‌వోసీలు లేవు. ఒక ఆసుపత్రి అసలు ఎలాంటి వ్యవస్థ లేకుండా నడుస్తోంది. మరో ఆసుపత్రిలో అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ ఉన్నా నిప్పు రాజుకుంటే హెచ్చరించే వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించారు. ఫలితంగా దీనికి ఎన్‌వోసీ రెన్యువల్‌ జారీ నిలిపివేశారు.

Updated Date - 2020-08-12T11:02:20+05:30 IST