ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి: ఈటల

ABN , First Publish Date - 2021-04-10T21:34:30+05:30 IST

ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వం తో వ్యవహారించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో

ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి: ఈటల

హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వం తో వ్యవహరించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందని, ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అనగానే దోచుకుంటాయి అనే పరిస్థితి వద్దని, పేదోడికి బెడ్లు దొరికే పరిస్థితి ఉండక పోవచ్చని, పేదలు మీ ఆస్పత్రికి వచ్చినపుడు..వాళ్లను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టొద్దని మంత్రి సూచించారు. కరోనా అంటే ఏడాది కింద ఉన్న భయం ఇపుడు లేదని, కొవిడ్ ట్రీట్మెంట్‌తో పాటూ నాన్ కోవిడ్ రోగులకు వైద్యం అందించాలని ఈటల రాజేందర్ సూచించారు.

Updated Date - 2021-04-10T21:34:30+05:30 IST