బోధనబాధలు!

ABN , First Publish Date - 2020-06-30T10:50:52+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత విద్యాసంవత్సరం చివరలో మూతపడిన పాఠశాలలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు.

బోధనబాధలు!

ఆన్‌లైన్‌ క్లాసుల వైపు ప్రైవేటు యాజమాన్యాల మొగ్గు

ప్రారంభిస్తే కఠిన చర్యలంటున్న విద్యాశాఖ

ఇప్పటికే కొలువులపై ఆందోళనలో టీచర్లు


ఖమ్మం, జూన్‌ 29:  కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత విద్యాసంవత్సరం చివరలో మూతపడిన పాఠశాలలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. దీంతో చాలా విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజులు ఆగిపో యాయి. ఫలితంగా కొన్ని యాజమాన్యాలు కొంద రు టీచర్లకు పూర్తి విద్యాసంవత్సరం జీతాలు చెల్లించగా.. చిన్న, మధ్య తరగతి విద్యాసంస్థలు మాత్రం సగం జీతాలు, ఇంకొన్ని సంస్థలు అసలు ఇవ్వకుండానే ఆపేశాయి. ఈ క్రమంలో అసలు ఈ ఏడాది క్లాసులు నిర్వహించకపోతే ప్రైవేటు సంస్థలు నష్టపో వడంతో పాటు.. విద్యార్థులు, టీచర్ల భవిష్యత్‌ కూడా అయోమయంలో పడే అవకాశాలున్నాయి. దీంతో పలు ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం ప్రారంభించాయి. తద్వారా చదువులో విద్యార్థులు నష్టపోకుండా ఉంచుతూ.. కొంతమేర ఫీజలు వసూలు చేసుకుని.. అటు సంస్థల మనుగడ కోల్పోకుండా, ఇటు దానిపైనే ఆధారపడిన టీచర్లకు అండగా నిలవాలని భావిస్తున్నాయి. కానీ ఈ వ్యవహారంతో బోఽ‘దన’బాధలు తప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహించొద్దని విద్యాశాఖ కఠినంగా హెచ్చరికలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. జిల్లా విద్యాశాఖ హెచ్చరికలతో రెండురోజులపాటు ఆన్‌లైన్‌ క్లాసులను ఆపిన ప్రైవేటు యాజమాన్యాలు ఎలా అయినా తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నాయి. 


తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు..

ప్రస్తుత కరోనా వ్యాప్తి విపత్కర సమయంలో నేరుగా తరగతులు బోధించడం సాధ్యం కాని పరిస్థితి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నాయి. అందుకోసం యాజమాన్యాలు డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ సమకూర్చుకు ంటూ తమ విద్యార్థులకు సమర్థవం తంగా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈ లెర్నిం గ్‌ను రెగ్యులర్‌ తరగతి గది ఫార్మాట్‌కు అనుకూలంగా మార్చుకునేలా బోధన సాగిస్తున్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఆర్టీ) కూడా 25శాతం విద్యా బోధన ఆన్‌లైన్‌ పద్ధతిలోనే పూర్తిచేసు కోవాలని సూచనప్రాయంగా వెల్లడిం చింది. దీంతో విద్యాసంస్థల నిర్వాహాకులు తమ, తమ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని జూమ్‌, గూగుల్‌మీట్‌ లాంటి యాప్‌ల వినియోగిస్తూ ఈ డిజిటల్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఆయా తరగతుల నిర్వహణకు  ఉపయోగిస్తున్నాయి. 


వీధిన పడుతున్న టీచర్లు..

పాఠశాలలు ప్రారంభించకపోవడంతో ఇప్పటి వరకు ప్రైవేట్‌ ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకున్న వారు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఖమ్మంలో 25 ఏళ్లుగా మాథ్స్‌ టీచర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్లడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణతో తమకు కొంత ఉపశమనం కనిపిస్తోందని, సగం జీతాలైనా వస్తాయన్న ఆశ ఉందని కొందరు ప్రైవేటు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై తరగతులు జరిగి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తేనే తమకు జీతాలు వస్తాయని, కానీ ప్రస్తుతం ఆపరిస్థితి లేదని, అందుకే ఆన్‌లైన్‌ బోధనతో కొంత మేర నష్టం పెరగకుండా ఉంటుందంటున్నారు. 

Updated Date - 2020-06-30T10:50:52+05:30 IST