ప్రైవేటుపరమైన శ్రావణ్‌పల్లి ఓసీ, కేకే-6గనులు

ABN , First Publish Date - 2021-10-15T06:56:11+05:30 IST

మందమర్రి ఏరియాలోని శ్రావణ్‌పల్లి ఓసీ, కేకే-6 గనులను ప్రైవేటు వారికి అప్పజెప్పుతూ కేంద్రం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి, వేజ్‌ బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

ప్రైవేటుపరమైన శ్రావణ్‌పల్లి ఓసీ, కేకే-6గనులు
మాట్లాడుతున్న వాసిరెడ్డి సీతారామయ్య

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

కార్మికులకు తెలపని గుర్తింపు సంఘం

ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య 

మందమర్రి, అక్టోబరు 14: మందమర్రి ఏరియాలోని శ్రావణ్‌పల్లి ఓసీ, కేకే-6 గనులను ప్రైవేటు వారికి అప్పజెప్పుతూ కేంద్రం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి, వేజ్‌ బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం మందమర్రి ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మందమర్రి ఏరియాలో నూతన గనులను ఏర్పాటు చేయడానికి ఒక్కోగనికి 20కోట్ల రూపాయలను ఖర్చు చేసి నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పజెప్పినా రాష్ట్ర ప్రభుతం నోరు విప్పడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో గుర్తింపు సంఘం కార్మికులకు ఎందుకు తెలపడం లేదని ప్రశించారు. సింగరేణిలో వీటితోపాటు కోట్ల రూపాయలను ఖర్చు చేసిన శ్రావణ్‌పల్లి, సత్తుపల్లికి చెందిన ఓసీ-3, ఎల్లందులోని కోయ గూడెం ఓసీ-3 గనులను సైతం ఇతరులకు కేటాయించిందని అన్నారు. ఈ గనులు కూడా గతంలో సింగరేణి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా గుర్తింపు సంఘం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి సింగరేణి ఖజానాను మింగేస్తున్నాయని అన్నారు. ఈ విషయంపై గుర్తింపు సంఘం మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో కార్మికులకు వచ్చే లాభాల వాటాలో ప్రతీ కార్మికుడు 50నుంచి 60వేల రూపాయలను నష్టపోయా రని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్‌, వెల్ది ప్రభాకర్‌, కంది శ్రీనివాస్‌, జెట్టి మల్లయ్య, సురమల్ల వినయ్‌, పొన్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:56:11+05:30 IST