అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే

ABN , First Publish Date - 2020-06-26T08:43:07+05:30 IST

అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని భారత అంతరిక్ష పరిశోధన

అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే

ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

యువత భవిష్యత్తుకు ఓ సోపానం

ఇస్రో చీఫ్‌ డాక్టర్‌ కె.శివన్

‌ 

శ్రీహరికోట (సూళ్లూరుపేట), జూన్‌ 25: అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ స్వాగతించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఇస్రోలో కొత్త యుగం ప్రారంభం కానుందని ఆయన  అభిప్రాయపడ్డారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్‌ సంస్థలను అనుమతించాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించడం, ఆ నిర్ణయాన్ని ఇస్రో మాజీ చీఫ్‌ మాధవన్‌ నాయర్‌ వంటి వారు వ్యతిరేకించడం తెలిసిందే. అయితే అవేవీ పట్టించుకోకుండా కేంద్ర కేబినెట్‌ అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను అనుమతించాలని బుధవారం నిర్ణయించింది. దీనికోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌స్పే్‌స)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం శివన్‌ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాకెట్‌ నిర్మాణం, వాటి ప్రయోగం, ఉపగ్రహాల తయారీ, వాటి అభివృద్ధి, వాణిజ్య ప్రాతిపదికన అంతరిక్ష రంగంలో సేవలందించడం వంటి సువర్ణావకాశం ప్రైవేట్‌ సంస్థలకు కలుగుతుందన్నారు. దేశంలో సాంకేతిక సామ ర్థ్యం, ప్రతిభ కలిగిన యువత భవిష్యత్తుకు ఇది సోపానం కాగలదని అన్నారు. ఇప్పటికే కొన్ని స్టార్టప్‌ కంపెనీలు తమను సంప్రదించాయని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-06-26T08:43:07+05:30 IST