Abn logo
Sep 6 2021 @ 09:27AM

ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించటం దారుణం

సీసీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ 


బాపట్ల టౌన్‌: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించటం దారుణమైన చర్య అని సీసీఐ జిల్లా కార్య దర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ 4వ మహాసభకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడు తూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులైన రైల్వే, విమాన, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, సింగరేణి వంటి పలు ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్‌ శక్తులకు ధారాత్తం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఉండరని తెలిపారు.  కార్యక్రమంలో సీపీఐ నాయకులు జెల్లి భాగ్యశ్రీధర్‌, ముత్తిరెడ్డి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.