Abn logo
May 31 2020 @ 11:22AM

విశాల్‌కు జోడీగా ప్రియాభవానీశంకర్‌

బుల్లితెర నుంచి సినీరంగానికి పరిచయమై కోలీవుడ్‌లో వర్ధమాన నటిగా ప్రియాభవానీశంకర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘అడంగమరు’ దర్శకుడు కార్తీక్‌ తంగవేలు తదుపరి విశాల్‌ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఫైనాన్షియర్‌ కదిరేశన్‌ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విశాల్‌కు కథ చెప్పడంతో ఆయన ఒకే చేశారు.ఆయనకు జోడీగా ప్రియాభవానీశంకర్‌ నటించనుంది. ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement