కమలా హారిస్‌కు అభినందనలు తెలిపిన ప్రియాంక చోప్రా!

ABN , First Publish Date - 2020-08-13T05:20:35+05:30 IST

డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా.. భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడె

కమలా హారిస్‌కు అభినందనలు తెలిపిన ప్రియాంక చోప్రా!

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా.. భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. కమలా హారిస్.. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవ్వడం పట్ల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో  స్పందించారు. ‘ఇది చారిత్రాత్మక నిర్ణయం.. కమలా హారిస్ ఎంపిక మహిళలందరికీ గర్వకారణం’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ‘అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న భారత సంతతి, నల్లజాతీయురాలైన కమలా హారిస్‌కు అభినందనలు’అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ.. భారత సంతతి మహిళలను ఎంపిక చేయడంపట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2020-08-13T05:20:35+05:30 IST