Abn logo
Jun 30 2020 @ 12:03PM

`నెపోటిజం`పై ప్రియాంక స్పందన!

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంకా చోప్రా. కెరీర్ తొలి నాళ్లలో ప్రియాంక కూడా నెపోటిజం బాధితురాలేనట. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుని బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక తొలి రోజుల్లో కొన్ని అవమానాలు ఎదుర్కొందట. బాలీవుడ్‌లోని బంధుప్రీతి గురించి గతంలోనే ప్రియాంక మాట్లాడింది. 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నెపోటిజం గురించి ప్రియాంక గతంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. `బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా. రికమెండేషన్‌తో వచ్చిన ఓ హీరోయిన్ కారణంగా నన్ను ఓ సినిమా నుంచి తప్పించారు. అయితే నేను దానిని అర్థం చేసుకోగలను. ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పని నేను చెప్పడం లేదు. కొన్ని మన చేతుల్లో ఉండవు. క్లిష్టమైన అనుభవాలు ఎదురైనపుడు ఎలా స్పందించాలో నేను నేర్చుకున్నా. గమ్యం గురించి తప్ప వేరే దేని గురించీ ఆలోచించకూడదని, ఓడిపోతామనే భయన్ని దరిచేరనీయకూడదని నిరంతరం నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని` అని ప్రియాంక చెప్పింది.  

Advertisement
Advertisement
Advertisement