ప్రియాంకతో DINNER కోసం... అమెరికా నుంచీ లండన్‌కు నిక్ జోనాస్

ప్రియాంక, నిక్ జోనాస్ ప్రేమకథ చాలా ఫేమస్. మన దేసీగాళ్ అమెరికన్ అందగాడి ప్రేమలో పడి కొన్నాళ్ల రొమాన్స్ తరువాత 2018లో ఘనంగా పెళ్లాడింది. అయితే, అప్పట్నుంచీ ఇప్పటిదాకా బలంగా కొనసాగుతోన్న వారి అనుబంధం ఈ మధ్య విడాకుల వార్తలతో చర్చకు దారి తీసింది. కాకపోతే, మేం విడిపోవటం లేదంటూ నిక్, ప్రియాంక ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సీక్రెట్ రివీల్ చేసింది లాస్ ఏంజిల్స్‌లో సెటిలైన మన ఇండియన్ ఏంజిల్...

పెళ్లి తరువాత ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలసి కాపురం పెట్టింది. అయితే, ఆమెకు లండన్‌లోనూ మరో ఇల్లు ఉంది. గత సంవత్సర కాలంగా అక్కడే ఉంటోంది. వివిధ షూటింగ్స్ కారణంగా పీసీ ఇంగ్లాండ్ రాజధాని వదల్లేకపోతోంది. అయితే, అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల భర్త, ఇటు వైపున తానూ ఉన్నా కూడా తమ మధ్య దూరం పెరగలేదంటోంది మిసెస్ జోనాస్. ఎందుకంటే, ఎప్పుడూ వారిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారట. ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తో సరిపెట్టక అప్పుడప్పుడూ నిక్ జోనాస్ అమెరికాలో విమానమెక్కి లండన్‌లో దిగేస్తుంటాడట! కేవలం ఒక్క డిన్నర్ కోసం ఆయన అలా ఫ్లైట్‌లో ఎగిరి వచ్చి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట! ప్రియాంకపై నిక్ బాబుకి అంత ప్రేమ ఉంది కాబట్టే... ఈ బాలీవుడ్, హాలీవుడ్ జంట విజయవంతంగా తమ బంధాన్ని కొనసాగించగలుగుతున్నారు!  

Advertisement