Sitapur: గెస్ట్‌హౌస్‌లో ఊడ్చిన ప్రియాంకగాంధీ

ABN , First Publish Date - 2021-10-04T18:20:30+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ అతిథి గృహంలో చీపురుతో ఊడ్చారు....

Sitapur: గెస్ట్‌హౌస్‌లో ఊడ్చిన ప్రియాంకగాంధీ

సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ అతిథి గృహంలో చీపురుతో ఊడ్చారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ అనంతరం అక్కడి బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకాగాంధీని యూపీ పోలీసులు అడ్డుకొని సీతాపూర్ గెస్ట్ హౌస్ కు తరలించారు. సీతాపూర్ అతిథిగృహంలో పోలీసుల నిర్బంధంలో ఉన్న ప్రియాంకగాంధీ చీపురు పట్టుకొని ఊడ్చి శుభ్రం చేశారు.తనను నిర్బంధించిన పోలీసులు వారెంట్ చూపించమని ప్రియాంక పోలీసులను కోరారు. లఖింపూర్ ఖేరీ బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు నిర్బంధించినా ధైర్యంగా ప్రశ్నించి తెగువ చూపిన ప్రియాంకగాంధీని సోదరుడైన ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసించారు.


Updated Date - 2021-10-04T18:20:30+05:30 IST