Abn logo
Sep 19 2020 @ 15:33PM

శర్వానంద్‌తో మరోసారి జోడీ కడుతున్న హీరోయిన్‌..!

Kaakateeya

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. 'ఆర్‌.ఎక్స్‌ 100' దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. నటీనటుల వివరాలను నెమ్మదిగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే శర్వా, సిద్ధార్థ్‌ పేర్లు తెలిశాయి. కాగా.. ఇప్పుడు 'మహా సముద్రంలో' నటించే హీరోయిన్స్‌ ఎవరు? అనే దానిపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఓ హీరోయిన్‌గా గ్యాంగ్‌ లీడర్ ఫేమ్‌ ప్రియాంక మోహన్‌ నటించనున్నారట. ఇప్పటికే శర్వానంద్‌ హీరోగా రూపొందుతోన్న శ్రీకారం సినిమాలోనూ ప్రియాంకనే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు మరోసారి శర్వానంద్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తెలుగులో సిద్ధార్థ్‌ రీ ఎంట్రీ మూవీ ఇదే. మరి ఈయన సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. 


Advertisement
Advertisement
Advertisement