Abn logo
Jul 8 2020 @ 03:07AM

‘మ్యాట్రిక్స్‌ 4’ లో ప్రియాంక

హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల్లో ‘మ్యాట్రిక్‌’ సిరీస్‌ పెను సంచలనం. ఇంతవరకూ వచ్చిన మూడు  సీరిస్‌  ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నాయి. తాజాగా రూపుదిద్దుకొంటున్న ‘మ్యాట్రిక్స్‌ 4’లో ప్రియాంక చోప్రా నటించనున్నారనేది అమె అభిమానులకు ఆనందకరమైన అంశమే. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. కేన్‌ రీవ్స్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఓ షెడ్యూల్‌ లాక్‌డౌన్‌కు ముందే పూర్తయింది. మార్చి నుంచి కొవిడ్‌-19 కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ను ఇటీవల బెర్లీన్‌లో ప్రారంభించారు. ఈ షూటింగ్‌లో ప్రియాంక కూడా పాల్గొంటున్నారని సమాచారం. 

సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు కీలకం కావడంతో  నటులు కొన్ని వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకొన్నారు. ‘మ్యాట్రిక్స్‌ 4’ 2022 ఏప్రిల్‌ 1న విడుదలవుతుంది. 

Advertisement
Advertisement
Advertisement