టీ ఆకులు పెరగలేదు. ఫొటోల కోసమే ఆ డ్రామా: ప్రియాంకపై షా విమర్శలు

ABN , First Publish Date - 2021-03-27T02:16:59+05:30 IST

శుక్రవారం అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతికి చిహ్నం. ఇదే మనల్ని బలవంతులుగా నిలుపుతోంది

టీ ఆకులు పెరగలేదు. ఫొటోల కోసమే ఆ డ్రామా: ప్రియాంకపై షా విమర్శలు

గువహాటి: అస్సాంలో టీ తోటల్లో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా తేయాకులు తెంపుతూ కనిపించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అస్సాంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రచారం జరిగింది. అయితే తేయాకులు తెంపడం వెనక పెద్ద రాజకీయం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. నిజానికి తేయాకులు కోతకు రాకముందే ఫొటోల కోసం వాటిని తెంపినట్లుగా ప్రియాంక నటించారని షా ఎద్దేవా చేశారు.


శుక్రవారం అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతికి చిహ్నం. ఇదే మనల్ని బలవంతులుగా నిలుపుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు తోబుట్టువులు అస్సాంకు పర్యాటకంగా వచ్చారు. ఇందులో ఒకరైన ప్రియాంక గాంధీ మొన్న తేయాకులు తెంపుతూ కనిపంచారు. వాస్తవానికి ప్రియాంక తేయాకులు తెంపలేదు. ఎందుకంటే ఆ ఆకులు ఇంకా కోతకు రాలేదు. ఫొటోల కోసమే ఆ తోటలో ఆకులు తెంపుతున్నట్లు ప్రియాంక నటించారు’’ అని అమిత్ షా అన్నారు.

Updated Date - 2021-03-27T02:16:59+05:30 IST