ఎన్నికల్లో పోటీపై స్పందించిన ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-10-20T00:14:15+05:30 IST

రాబోయే ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి దిగే విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు

ఎన్నికల్లో పోటీపై స్పందించిన ప్రియాంక గాంధీ

లఖ్‌నవూ: రాబోయే ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి దిగే విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న ప్రియాంక రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోనియా, రాహుల్ నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రియాంక.. పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయిస్తుండడంతో పోటీపై వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈ సందర్భంగానే గాంధీ కుటుంబానికి కంచు కోట అయిన రాయ్‌బరేలి స్థానం నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రియాంకను మీడియా ప్రశ్నించింది. దీనికి ప్రియాంక సమాధానం ఇస్తూ ‘‘ఎన్నికల్లో పోటీ అనేది అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. పోటీ చేస్తానో లేదో చెప్పలేదు. ఎన్నికల్లో పోటీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే మీడియా ఇదే విషయాన్ని పదే పదే అడగడంతో ‘‘మీరు నా నుంచి ఏదో రాబట్టాలని చూసి లాభం లేదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది’’ అని ప్రియాంక నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Updated Date - 2021-10-20T00:14:15+05:30 IST