ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-09-26T13:13:58+05:30 IST

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, కనిగిరి, అద్దంకిలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణం సమీపం నుండి ప్రవహించే సగిలేరు వాగుకు ఉధృతంగా నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీటికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాచర్లలో అత్యధికంగా 20సెంటీమీటర్, గిద్దలూరులో 15.3 సెంటీమీటర్, అద్దంకిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

Updated Date - 2020-09-26T13:13:58+05:30 IST