ఓలా, ఉబెర్ అంత పని చేశాయా?.. కేంద్రం దర్యాప్తు!

ABN , First Publish Date - 2021-01-13T01:18:30+05:30 IST

ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఉబెర్లపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ రెండు సంస్థలు జీఎస్టీ కట్టకుండా ఎగవేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) తెలిపింది.

ఓలా, ఉబెర్ అంత పని చేశాయా?.. కేంద్రం దర్యాప్తు!

న్యూఢిల్లీ: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఉబెర్లపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ రెండు సంస్థలు జీఎస్టీ కట్టకుండా ఎగవేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) తెలిపింది. ఈ రెండూ కంపెనీలు తమ డ్రైవర్లకు ఇచ్చే ఇన్సెంటివ్స్‌పై జీఎస్టీ కట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కస్టమర్లు తమ రైడ్లు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వారికి వేసే ఫైన్ల ద్వారా ఆర్జించే సంపదపై కూడా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంస్థలపై దర్యాప్తు చేపట్టాలని డీజీజీఐ నిర్ణయించింది. కాగా, ఈ పన్ను సంబంధిత సందేహాలపై అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్నామని ఉబెర్ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

Updated Date - 2021-01-13T01:18:30+05:30 IST