Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా జీవితం ఇలా ముగియాల్సిందేనా?

ఆంధ్రజ్యోతి(11-08-2020)

ప్రశ్న: డాక్టర్‌! 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాను. ట్రాక్టర్‌ నా నడుము పైనుంచి వెళ్లడంతో ఎముక విరిగి, మూత్రనాళం తెగిపోయింది. ఆ తర్వాత సర్జరీ జరిగింది. అంగస్తంభనలు నెమ్మదిగా వస్తాయి అని వైద్యులు చెప్పినా, ఆ తర్వాత నుంచి నా అంగం మూత్రవిసర్జనకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్ప స్తంభించడం లేదు. ఇప్పుడు నా వయసు 35. వద్దు అంటున్నా వినకుండా తల్లితండ్రులు నాకు మరదలితో పెళ్లి చేశారు. మూడేళ్ల నుంచి భార్యను లైంగికంగా కలవలేదు. మందులు వాడినా ఉపయోగం లేదు. నా జీవితం ఇలా ముగిసిపోవలసిందేనా? అందరు మగవాళ్లలా లైంగిక జీవితాన్ని ఆస్వాదించి, పిల్లలను కనే అదృష్టం నాకు లేదా? 


 - ఓ సోదరుడు, వరంగల్‌


డాక్టర్ సమాధానం: నడుము పై నుంచి వాహనం వెళ్లినప్పుడు, ఆ బరువుకు నడుములోని పెల్విక్‌ బోన్‌తో పాటు, దాని అడుగున ఉన్న మూత్రనాళం, రక్తనాళాలు, కండరాలు నలిగి, తెగిపోతాయి. సర్జరీ సమయంలో తెగిన మూత్రనాళాన్ని సరిచేసినా, అంగస్తంభనకు తోడ్పడే రక్తనాళాలను పునరుద్ధరించే పరిస్థితి ఉండదు. దాంతో అంగస్తంభనలు శాశ్వతంగా పోవచ్చు. మీ విషయంలో ఇదే జరిగి ఉంటుంది. అయితే లైంగిక తృప్తి పొందడానికి పినైల్‌ ఇంప్లాంట్స్‌ ఉంటాయి. సర్జరీ ద్వారా దీన్ని అంగంలో అమర్చుకుంటే అంగం స్తంభించి ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనడానికి తోడ్పడుతుంది. లైంగిక తృప్తికీ ఢోకా ఉండదు. వీర్యకణాలు సరిపడా ఉంటే, సహజసిద్ధంగా పిల్లలు కలగవచ్చు. ఒకవేళ వీర్యకణాలు లేకపోతే ఐ.వి.ఎఫ్‌ ద్వారా పిల్లలను కనే ప్రయత్నం చేయవచ్చు. పినైల్‌ ఇంప్లాంట్‌ ఎంతో సురక్షితమైనది. దీంతో ఎటువంటి శారీరక అసౌకర్యం ఉండదు. కాబట్టి నిరాశపడకుండా ఈ సర్జరీ గురించి వైద్యులతో చర్చించండి. 


డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

8332850090   

(కన్సల్టేషన్‌ కోసం)

Advertisement
Advertisement