Abn logo
Sep 19 2021 @ 23:27PM

సమస్యల పరిష్కారం పీఆర్టీయూటీఎస్‌కే సాధ్యం

మాట్లాడుతున్న కూర రఘోత్తంరెడ్డి

-ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి 

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 19: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్‌టీయూటీఎస్‌కే సాధ్యమని ఉపాధ్యాయ ఎంఎల్‌సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. ఆదివారం వినయ్‌గార్డెన్స్‌లో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్‌ స్వర్ణోత్సవ సభ, జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు 30శాతం ఫిట్‌మెంట్‌ అందేలా సంఘం ఎంతగానో కృషి చేసిందన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలే ఎజెండాగా పని చేసే ఏకైక సంఘం పీఆర్టీయూ అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులే కీలకమని, వారి సమస్యల కోసం తమ సహకారం తప్పకుండా ఉంటుం దన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మెన్‌ కోనేరు క్రిష్ణారావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటు కూరి శ్రీనివాసరావు, ఆడె ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.