Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోటవురట్ల హైస్కూల్‌లో సమస్యల తిష్ఠ


 ఉపాధ్యాయుల కొరత 

 తరగతి గదులు చాలక విద్యార్థుల అవస్థలు 

 ఎండకు ఎండి... వానకు తడుస్తున్న సైకిళ్లు

కోటవురట్ల, నవంబరు28 : మం డల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులను పలు సమ స్యలు వేధిస్తున్నాయి. ఏటా ఈ పాఠ శాల ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా సమస్యలపై మాత్రం దృష్టి సారించే వారు కరువయ్యారు. ఇక్కడ ఆరో తర గతి నుంచి పదో తరగతి వరకు 554 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. వీరంతా అరకొర వసతులతో  అవస్థలు పడుతున్నారు.  ఈ పాఠ శాలలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పదిహేను తరగతి గదులు అవసరం కాగా, పదకొండు గదులు మాత్రమే ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది. మొత్తం 26మంది ఉపాధ్యా యులు అవసరం కాగా, 12 మంది పనిచేస్తున్నారు.  జనవరిలో ఇక్కడి నుంచి పలువురు ఉపాధ్యాయులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ వారి స్థానాలు భర్తీ కాలేదు. ఇదిలావుంటే, విద్యార్థులు సైకిళ్లు నిలుపుకోవడానికి సౌకర్యాలు లేవు. సుదూర ప్రాంతాల నుంచి ఈ పాఠశాలకు సైకిళ్లపై పలు వురు విద్యార్థులు వస్తుంటారు. వీరి సైకిళ్లు ఉంచుకునేందుకు షెడ్లు వం టివి లేకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఒక్కోసారి ఎండలకు టైర్లు పంక్చర్లు అవుతుం డడంతో వీరి అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. భోజనాలు చేసేందుకు కూడా సరైన వసతి సౌకర్యం లేదు. ఇప్పటికైనా విద్యా శాఖ ఉన్నతాధి కారులు తమ పాఠశాలలో సమస్యలపై దృష్టి సారించాలని వారంతా కోరు తున్నారు. 

Advertisement
Advertisement