Abn logo
Sep 25 2021 @ 00:20AM

తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

తపాలా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

 భగత్‌నగర్‌, సెప్టెంబరు 24: అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్‌ ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా  యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ట్రేడ్‌ యూనియన్‌ హక్కులపై జరుగుతున్న వ్యతిరేక చర్యలను నిలిపి వేయాలన్నారు. ఎన్‌పీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, డీఏను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శులు రమేష్‌, అనిల్‌, సుధాకర్‌, ఎండిఎఫ్‌ రహమాన్‌, కెవి పవన్‌కుమార్‌, పి కృష్ణారెడ్డి, సిహెచ్‌ కుమారస్వామి, కె చక్రపాణి, బి మహేష్‌, మౌనిక, రాంచంద్రం, శివ, ఎన్‌ శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, సాయికుమార్‌, మల్లేశం, సదయ్య, మనోహర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.