నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-23T06:12:41+05:30 IST

మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు.

నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల సమస్యలపై చర్చిస్తున్న వినోద్‌కుమార్‌

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మిడ్‌ మానేరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లోని సమస్యలు, ఇతర ఇబ్బందులపై చర్చించారు. ముంపునకు గురైన గ్రామాల పేరుతో ఏర్పాటు చేసిన కాలనీల్లో  పూర్తిస్థాయిలో సర్వే చేయించి ఇళ్లకు  నంబర్లు వేయించాలని  కలెక్టర్‌కు వివరించారు. కోర్టు కేసులు, పెండింగ్‌లో ఉన్న స్థలాలను పూర్తి స్థాయిలో సర్వే చేయిం చాలని, వారికి న్యాయం చేయాలని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించాలని, వారం రోజుల్లో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ ప్రతీ కాలనీలో సర్పంచ్‌ పర్యవేక్షణలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆర్డీవో ద్వారా సర్వే చేయిస్తామని, గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఆర్డీవో శ్రీనివాసరావు, బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, వేములవాడ అర్బన్‌ జడ్పీటీసీ మ్యాకల రవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ తోట అగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:12:41+05:30 IST