ఇన్‌చార్జిలతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-03-16T05:17:19+05:30 IST

విద్యాశాఖలో ఇన్‌చార్జిలతో ఇబ్బందులు ఎ దురవుతున్నాయి.

ఇన్‌చార్జిలతో ఇబ్బందులు
నారాయణపేట విద్యాశాఖ కార్యాలయం

- అదనపు బాధ్యతలతో లోపించిన పర్యవేక్షణ 

- గాడి తప్పుతున్న విద్యాశాఖ పనితీరు

- విద్యార్థుల బోధన అస్తవ్యస్తం

నారాయణపేట, మార్చి 15 : విద్యాశాఖలో ఇన్‌చార్జిలతో ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ లోపించడంతో విద్యా శాఖ పనితీరు గాడి తప్పుతోంది. విధుల పట్ల పలువురు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యాబోధన అస్తవ్యస్థంగా తయారౌతుం ది. ఇప్పటికే కరోనాతో పాఠశాలలకు సెలవులు రావడం, కరోనా కట్టడితో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకొని పాఠశాలలను పర్యవేక్షించాల్సిన ఎంఈవోలు ఇన్‌చార్జిగా కొన సాగడంతో పలువురు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇతర ఆర్థిక వ్యాపారాలపైనే అధిక శ్రద్ధ వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వారిని చూసి ఇతర ఉపాధ్యాయులు సైతం అదే దారిలో వెళ్తు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం విధుల వారిని వెంటేసుకొస్తూ వత్తాసు పలుకుతుండడంతో రోజురోజుకూ విద్యాబోధన అస్తవ్యస్థంగా తయారౌతుంది. 

ఇద్దరే రెగ్యులర్‌ ఎంఈవోలు

11 మండలాలకు ఇద్దరే రెగ్యులర్‌ ఎంఈవోలు ఉన్నారు. వారిలో మక్తల్‌ ఎంఈవో లక్ష్మీనారాయణకు నర్వ, మాగనూర్‌, కృష్ణ మండలాలు, ఊట్కూర్‌ ఎంఈవో వెంకటయ్యకు దామరగిద్ద మండలం ఎంఈవోగా అదన పు బాధ్యతలను అప్పగించారు. కోస్గి అంజలిదేవికి ధన్వాడ, మరికల్‌ మం డలాలు, మద్దూర్‌ గోపాల్‌నాయక్‌కు నారాయణపేట అదనపు బాధ్యతలను అప్పగించారు. తమ పాఠశాలలతో పాటు ఆయా మండలాలలో ఉపాధ్యాయులపై అజమాయిషి వహించి పర్యవేక్షించాల్సి వస్తుండడంతో అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ లోపిస్తుంది. కాగా జిల్లాలో 500 పాఠశాలలకు గాను 2,037 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ నిమిత్తం 33 క్లస్టర్లకు 31 మంది సీఆర్పీలు ఉన్నా ఆ సీఆర్పీలు కూడా పాఠశాలలను పర్యవేక్షించ లేక కార్యాలయాలకే పరిమితమవు తున్నారు. 33 క్లస్టర్లకు సగానికి పైగా జీహెచ్‌ఎంలు లేక ఎఫ్‌ఏసీ ఉన్నవారే ఇటు పాఠశాలకు అటు క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లు చూసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ విద్యాశాఖపై దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2022-03-16T05:17:19+05:30 IST