Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాస్ర్తీయ దృక్పథంలేని జీవన విధానంతోనే సమస్యలు

- అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌

ధర్మవరం, నవంబరు 28: శాస్ర్తీయ దృక్పథంలేని  జీవన విధానం వల్ల నేడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అనంతపురం ఆర్డీఓ మధుసూ దన్‌ పేర్కొన్నారు. పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్‌లో ఆదివారం  జేవీవీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి  సైన్స్‌ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్యఅతిఽథులుగా హాజరైన ఆర్డీఓ మధుసూదన్‌,  మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌   మాట్లాడుతూ..సమాజంలో అన్ని వర్గాలప్రజల్లో మూఢనమ్మకాలు, కుల, మత, ప్రాంతీయ ధోరణులు ఎక్కువయ్యాయన్నారు. దీంతో ప్రజలు అభద్ర తకు గురవుతున్నారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు పూర్తిగా వ్యాపా రమయమై పోయాయని, తద్వారా సైన్స్‌ ఫలితాలు సామాన్య ప్రజలకు చేరడంలేదన్నారు. విద్యార్థులు  పాఠశాల స్థాయి నుండే ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలన్నారు. అదేవిధంగా డాక్టర్‌ యుగంధర్‌ వ్యాక్సిన్‌  ఆవశ్యకతను వివరించారు.  అనంతరం ప్రశ్నాపత్రాలను వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లాప్రరధాన కార్యదర్శి ఆదిశేషు, రాష్ట్ర నాయకులు డాక్టర్‌ బషీర్‌, రాష్ట్ర కార్యదర్శి మహేంద్రరెడ్డి, ఆత్మీయ ట్రస్టు చైర్మన్‌, యూటీఎఫ్‌ జిల్లాఅధ్యక్షుడు శెట్టిపిజయచంద్రారెడ్డి,  కాకతీ య విద్యానికేతన్‌ పాఠశాల డైరెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి రామిరెడ్డి, చెకుముకి కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, లోకేశ్‌, నరేంద్ర బాబు, బాబ్జాన్‌, రామక్రిష్ణ, లక్ష్మీనారాయణ, జగదీశ్‌, పాఠశాల హెచ్‌ఎం నిర్మల పాల్గొన్నారు.

Advertisement
Advertisement