స్మార్ట్‌ఫోన్‌తో సమస్యలు

ABN , First Publish Date - 2021-06-10T05:30:00+05:30 IST

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్‌ లేకపోతే ఉండలేని వాళ్లున్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఫోన్‌తో అత్యధిక సమయం కాలక్షేపం చేసే సంఖ్య ఎక్కువైంది.

స్మార్ట్‌ఫోన్‌తో సమస్యలు

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్‌ లేకపోతే ఉండలేని వాళ్లున్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఫోన్‌తో అత్యధిక సమయం కాలక్షేపం చేసే సంఖ్య ఎక్కువైంది. అయితే అధిక సమయం స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడినా, వీడియోలు చూసినా తిప్పలు తప్పవంటు న్నారు నిపుణులు. ఫోన్‌ మాట్లాడినప్పుడు చెమట ఫోనుకు తగులుతుంది. ఫోను పైభాగం నికెల్‌, క్రోమియంతో తయారు చేసి ఉంటుంది. దానిపై బ్యాక్టీరియాలు అంటుకుని ఉంటాయి. అందుకే ఫోన్‌ పౌచ్‌లు ఉపయోగిస్తే మంచిదట. అంతేకాదు ఫోన్‌, పౌచ్‌లను రోజూ శుభ్రం చేయాలి.


ఇతరుల ఫోను తీసుకుని మాట్లాడటం కూడా ఈ కరోనా సమయంలో మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఫోను కళ్లకు సమాంతరంగా ఉంచి చూస్తే కంటిసమస్యలుండవు. ఫోనులో నుంచి వచ్చే కిరణాలు కంటికి మంచిది కాదు. అందుకే సాధ్యమైనంత వరకు ఫోన్‌ బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవటం మంచిదట. డార్క్‌, నైట్‌ మోడ్‌లో ఫోన్‌ చూడటం ఉత్తమం. ప్రత్యామ్నాయ ఉపాయాలు ఆలోచించకుండా ఫోన్‌ఽఽమీద ధ్యాసను తగ్గించుకోవటమే మంచిదని నిపుణులు అంటున్నారు. 

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST