Abn logo
Dec 3 2020 @ 17:37PM

రష్మిక ‘పొగరు’ రేటెంతో తెలుసా?

టైటిల్‌ చూసి హీరోయిన్‌ రష్మికకు పొగరుందని, ఆ పొగరుకి రేటుందని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు.. కాకపోతే ఆమె కన్నడలో నటించిన 'పొగరు' చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. ధృవ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌. ఈ చిత్ర తెలుగు హక్కులను నిర్మాత డి. ప్రతాప్‌ రాజు రూ. 3.30 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని 'క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు..' పాట విడుదల తర్వాత వ‌చ్చిన క్రేజ్‌తో చాలా మంది తెలుగు రైట్స్ కోసం పోటీ ప‌డ‌గా.. ఈ ఫ్యాన్సీ రేటుకు వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రొడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తెలుగులో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేస్తున్నారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజు మాట్లాడుతూ.. ''ఇటీవ‌ల విడుదలైన ఒకే ఒక్క సాంగ్‌తో యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న పొగ‌రు క‌న్న‌డ చిత్ర తెలుగు హ‌క్కుల‌ను రూ. 3 కోట్ల 30 ల‌క్ష‌ల‌కి సొంతం చేసుకున్నాము. మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాము. ఈ సినిమా సాంగ్ క‌న్న‌డ‌లో 170 మిలియ‌న్స్ పైగా వ్యూస్, తెలుగులో 43 మిలియ‌న్స్ వ్యూస్‌కి పైగా రావ‌టం విశేషం. ఇంత క్రేజ్‌ వ‌చ్చిన సినిమాకి టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేష‌న్ రాగా మా సంస్థ సొంతం చేసుకోవ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి విడుదలకి స‌న్నాహాలు చేస్తున్నాము. క‌న్న‌డ టైటిల్ పొగ‌రు కాగా తెలుగులో ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. అతిత్వ‌ర‌లో ఈ సినిమా రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగా తెలుగులో టైటిల్ ని అనౌన్స్ చేస్తాము. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తాం.." అని తెలిపారు.



Advertisement
Advertisement
Advertisement