May 18 2021 @ 13:39PM

నిర్మాత స్రవంతి ర‌వికిషోర్‌కు పితృ వియోగం

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత స్రవంతి ర‌వికిషోర్‌ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి పోతినేని సుబ్బారావు(91) అనారోగ్యంతో విజ‌య‌వాడ‌లో మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. హీరో రామ్‌కు ఈయ‌న తాత అవుతారు. త‌న తాత‌య్య మ‌ర‌ణంపై హీరో రామ్ విచారాన్ని వ్య‌క్తం చేస్తూ ‘‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభ‌మైన మీ జీవితం మాకెన్నో పాఠాల‌ను నేర్పించింది. కుటుంబ స‌భ్యుల‌కు అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను అందించ‌డం కోసం మీరెంతో క‌ష్ట‌ప‌డ్డారు. లారీ టైర్లపై నిద్రించేవారు. మీరు రాజులాంటి వారు. జేబులో ఉన్న డ‌బ్బుని బ‌ట్టి కాకుండా, మంచి మ‌న‌స్సు వ‌ల్లే ధ‌న‌వంతుల‌వుతార‌ని, మీరే మాకు నేర్పించారు. మీ కార‌ణంగానే మీ పిల్ల‌లంద‌రూ ఉన్న‌త స్థానంలో ఉన్నారు. మీ మ‌ర‌ణ వార్త న‌న్ను ముక్క‌లు చేసింది. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను’’ ఎమోష‌న‌ల్‌ ట్వీట్ చేశారు.