Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీసీ మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభించాలి

రేణిగుంట, నవంబరు 30: మండలకేంద్ర సమీపంలోని తిరుపతి కాటన్‌మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రేణిగుంట-పుత్తూరు మార్గంలోని కాటన్‌మిల్లు ఎదుట కార్మికసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సీపీఎం నేత శివానందం, బీఎంఎ్‌స నేతలు జ్ఞానశేఖర్‌, శివకుమార్‌ మాట్లాడుతూ... కాటన్‌ మిల్లును మూసివేసేందుకు గత పాలకప్రభుత్వాలు కుట్ర చేసినట్లు చెప్పారు. దీంతో 20శాతానికి ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిందని వాపోయారు. ఈ మిల్లుకు నాణ్యతలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందనీ, కేంద్రప్రభుత్వం స్పందించి మిల్లు సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, తూకివాకం సర్పంచ్‌ మునిశేఖర్‌ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, సెల్వరాజ్‌, పళని, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement