సెప్టెంబరు నుంచి భారత్‌లో స్పుత్నిక్- వీ టీకా ఉత్పత్తి!

ABN , First Publish Date - 2021-08-01T13:18:32+05:30 IST

రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారత్‌లో...

సెప్టెంబరు నుంచి భారత్‌లో స్పుత్నిక్- వీ టీకా ఉత్పత్తి!

మాస్కో: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారత్‌లో సెప్టెంబరు నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి కానున్నదని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతోపాటు ఐదు కంపెనీలు సంయుక్తంగా స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాయని, తద్వారా భారత్ ప్రముఖ టీకా ఉత్పాదక కేంద్రంగా మారనున్నదని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. ఇదేవిధంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సెకెండ్ బ్యాచ్ ఉత్పత్తిలో జాప్యం జరగబోదని తెలిపింది. భారత్‌లోని భాగస్వామ్య కంపెనీల సాయంలో సెకెండ్ బ్యాచ్ ఉత్పత్తి జరగనున్నదని పేర్కొంది. ఇందుకు సంబంధించి రష్యా, భారత్ లోని వ్యాక్సీన్ ఉత్పాదక కంపెనీల మధ్య ఒప్పందపు సంతకాల ప్రక్రియ జరగనున్నదని తెలిపింది. దీనితోపాటు ఆగస్టు నుంచి భారత్‌లో స్పుత్నిక్-వీ తోపాటు స్పుత్నిక్ లైట్ వ్యాక్సీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. 

Updated Date - 2021-08-01T13:18:32+05:30 IST