అవిశ్రాంత ఉద్యమ నేత ప్రొఫెసర్‌ శేషయ్య

ABN , First Publish Date - 2021-10-18T04:54:23+05:30 IST

అవిశ్రాంత ఉద్యమ హక్కుల నేత ప్రొఫెసర్‌ శేషయ్య అని పంజాబ్‌ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌, అఖిల భారత విద్యా హక్కు సమాఖ్య చైర్మన ఆచార్య జగ్‌మోహనసింగ్‌ అన్నారు.

అవిశ్రాంత ఉద్యమ నేత ప్రొఫెసర్‌ శేషయ్య
ఫ్రొఫెసర్‌ శేషయ్యపై రచించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ జగ్‌మోహనసింగ్‌, శశికళ, రమేష్‌పట్నాయక్‌, చంద్రశేఖర్‌ తదితరులు

పంజాబ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఆచార్య జగ్‌మోహనసింగ్‌

గుంటూరు, అక్టోబరు 17: అవిశ్రాంత ఉద్యమ హక్కుల నేత ప్రొఫెసర్‌ శేషయ్య అని పంజాబ్‌ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌, అఖిల భారత విద్యా హక్కు సమాఖ్య చైర్మన ఆచార్య జగ్‌మోహనసింగ్‌ అన్నారు. ఆదివారం పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పౌర హక్కుల నేత, న్యాయవాద ప్రొఫెసర్‌ శేషయ్య మొదటి సంస్మరణ సభ స్థానిక బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ జగ్‌మోహనసింగ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన అమరుడు శేషయ్య అని కొనియాడారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేష్‌పట్నాయక్‌, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ప్రసంగించారు. దివంగత ప్రొఫెసర్‌ శేషయ్య సహచరి ఆర్‌.శశికళ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యలు పౌర హక్కుల ఉద్యమ ధృవతార, రాజ్యాంగం-పౌరహక్కులు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పౌర హక్కుల సంఘాల నేతలు ఎం.శ్రీమన్నారాయణ, పి.ఆంజనేయులు, ఎం.నారాయణ, ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌.లక్ష్మారెడ్డి, దుడ్డు ప్రభాకర్‌(కేఎనపీఎస్‌), బి.కొండారెడ్డి(పీకేఎస్‌), విరసం నేతలు రుక్మిణి, సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ప్రజాసంఘాల నాయకులు వై.వెంకటేశ్వరరావు, సీహెచఎన మూర్తి  పాల్గొన్నారు. ప్రజాకళామండలి కళాకారుల విప్లవ గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.


Updated Date - 2021-10-18T04:54:23+05:30 IST