Abn logo
May 23 2020 @ 00:00AM

ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ లాక్‌

ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ను ఎవరైనా చూడొచ్చు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ కాకపోయినా ప్రొఫైల్‌ పిక్‌తో సహా పోస్టులు, ఇతర వివరాలు చూసే వీలుంది. అయితే ఇకముందు స్నేహితులు కాని వారు చూడకుండా ప్రొఫైల్‌ను లాక్‌ చేసే సదుపాయాన్ని ఫేస్‌బుక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌ వినియోగదారుల భద్రత కోసం ఈ ఫీచర్‌ను జోడించింది. ముఖ్యంగా మహిళలకు ఈ సేఫ్టీ ఫీచర్‌ ఉపయుక్తం కానుంది.


ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నియంత్రణ కోసం ఈ ‘లాక్‌ ప్రొఫైల్‌’ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను ఎవరైనా చూసే వీలుంది. ఈ విషయంలో మహిళలు కొంత ఇబ్బందిగా ఫీలయ్యే వారు. తాజా ఫీచర్‌తో ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. సోషల్‌ మీడియాలో సెక్యూరిటీ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవడానికి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో మీ పేరు కింద ఉన్న ‘మోర్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. తరువాత ‘లాక్‌ ప్రొఫైల్‌’ని సెలెక్ట్‌ చేసుకుని, కన్ఫార్మ్‌ చేయాలి. ఒకసారి ప్రొఫైల్‌ని లాక్‌ చేస్తే ఫేస్‌బుక్‌లో మీ స్నేహితులు కాని వారు మీ ప్రొఫైల్‌ని చూడలేరు. ఫొటోలు, పోస్టులు చూసే వీలుండదు. 

Advertisement
Advertisement
Advertisement