‘టెస్లా’కు బిలియన్ డాలర్లకు పైగా లాభం

ABN , First Publish Date - 2021-07-28T21:53:17+05:30 IST

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ మొదటిసారిగా బిలియన్ డాలర్లకు పైగా లాభాలనార్జించింది.

‘టెస్లా’కు బిలియన్ డాలర్లకు పైగా లాభం

న్యూయార్క్ : ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ మొదటిసారిగా బిలియన్ డాలర్లకు పైగా లాభాలనార్జించింది. ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ ప్రకారం, టెస్లా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1.10 బిలియన్ డాలర్ల లేదా షేరుకు 1.02 డాలర్ల మేరకు లాభాలనార్జించింది. గతేడాది జూన్ త్రైమాసికం కంటే ఇది పది రెట్లు అధికం. రికార్డు స్థాయిలో మూడు నెలల్లో టెస్లా లాభాలు రెట్టింపు కావడం గమనార్హం.


కాగా... ఇందుకు కారణాల్లో మొదటిది...  కంపెనీ తక్కువ ఖరీదైన విద్యుత్తు వాహనాలను విక్రయించడం.  రెండవది... ఇతర  కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం. ఇక టెస్లా కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవడం.  ఇక టెస్లా ఆదాయం 12 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. ఇది ఏడాది క్రితం 6.04 బిలియన్ డాలర్లు మాత్రమే. మొత్తమీద... ఈ క్రమంలో... కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ నికర విలువ కూడా 180 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా చిప్ కొరత కారణంగా ఇతర కార్ల తయారీదారుల ఉత్పత్తి ప్రభావితమైంది. ఈ మూడు నెలల కాలంలో టెస్లా 2.06 లక్షల విద్యుత్తు కార్లను  విక్రయించడం గమనార్హం. 

Updated Date - 2021-07-28T21:53:17+05:30 IST