బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి: సీపీ

ABN , First Publish Date - 2021-01-17T21:43:39+05:30 IST

ఈ నెల 5న జరిగిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి సాధించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కిడ్నాప్‌ కేసులో విచారణలో

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి: సీపీ

హైదరాబాద్: ఈ నెల 5న జరిగిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి సాధించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్‌ కేసులో విచారణలో 15 మంది ఉన్నారని తేలిందని ప్రకటించారు. విచారణలో మరికొందరి పేర్లు బయటికి వచ్చాయని వెల్లడించారు. మాజీమంత్రి భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా గుర్తించామని తెలిపారు. అఖిలప్రియ కస్టడీలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయని సీపీ చెప్పారు. కిడ్నాప్ చేయడానికి ముందు బోయా సంపత్, బాల చెన్నయ్య రెక్కీ నిర్వహించారని తెలిపారు. గుంటూరు శ్రీను స్నేహితుడు సిద్దార్థ కారు ఏర్పాటు చేశాడని చెప్పారు. కానిస్టేబుల్‌ డ్రెస్‌లో వచ్చి కిడ్నాప్‌ చేసిన దేవరకొండ కృష్ణ అరెస్ట్‌ చేశామని అంజనీకుమార్ తెలిపారు.  కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్ కోసం గాలిస్తున్నారు. వీరితో పాటుగా మాదాల శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-01-17T21:43:39+05:30 IST