Sep 21 2021 @ 11:36AM

‘ప్రాజెక్ట్ k’: నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్..

పాన్ ఇండియన్ స్టార్ నటిస్తున్న సైన్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ k’ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నవంబర్ వరకు వీటికి సంబంధించి ప్రభాస్‌పై జరుగుతున్న సన్నివేశాలు దాదాపు పూర్తి కానున్నాయట. దాంతో వెంటనే 'ప్రాజెక్ట్ k' మీద దృష్ఠిపెట్టనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణ్ హీరోయిన్‌గా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్ర విశేషాలను నిర్మాత అశ్వినీ దత్‌ వెల్లడించారు. 

అశ్వినీ దత్‌ మాట్లాడుతూ.. 'ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి దాదాపు 13నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ కొనసాగిస్తాం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, అమితాబ్‌లతో పాటు మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇప్పటికే గ్రాఫిక్స్‌ పనులు ప్రారంభమయ్యాయి' అని  తెలిపారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు క్రియేటిడ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ మూవీ 'రాధే శ్యామ్' 2020, జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.