Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘పోలవరం’ భూ పరిహారం హామీ ఏమైంది

  • విలీన మండలాల్లో కుంటుపడిన అభివృద్ధి
  • మూడు పార్టీలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి 
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. ముగిసిన మహాసభలు

 చింతూరు, డిసెంబరు 5: రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఎకరాకు రూ.1.15 లక్షలు మాత్రమే పరిహారంగా ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. అయితే జగన్‌ ఎన్నికల పర్యటనలో భాగంగా విలీన మండలాలకు వచ్చిన సందర్భంలో తాను అధికారంలోకి వస్తే ఆ భూములకు తిరిగి ఎకరాకు రూ.5 లక్షల వంతున పరిహారం చెల్లిస్తామంటూ ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు ఆ హామీ ఊసే ఎత్తడం లేదని ఆయన అన్నారు. సీపీఎం జిల్లా మహా సభలు ఆదివారం ముగిసిన సందర్భంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. విలీన మండలాల్లో విద్య, వైద్యం, అభివృద్ధి రం గాలు కుంటుపడ్డాయని అన్నారు. ముందుగా భూ పరిహారం అతి తక్కువగా ఇచ్చిన నేపథ్యంలో తిరిగి ఆయా రైతాంగానికి ఎకరాకు రూ.10 లక్షల వంతున చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విత్తనాలు, ఎరువుల సరఫరా విష యంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జగన్‌ చెప్పినప్పటికీ ఆ మాట వాస్తవ రూపంలో కాన రావడం లేదని మధు అన్నారు. రహదారుల ఏర్పాటు విషయం ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఐటీడీఏ, జీసీసీ ద్వారా గిరిజనులకు మేలు జరగడం లేదన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తున్నాయని, దీంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లా నూతన కార్యవర్గం నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పల్లపు వెంకట్‌, సీసం సురేష్‌ పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శిగా అరుణ్‌ 

సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శిగా టి.అరుణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చింతూరులో జరిగిన జిల్లా మహాసభల్లో అరుణ్‌ని పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నుకుంది. కాగా అరుణ్‌ రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. 

Advertisement
Advertisement