ఏఎస్‌ఐలకు పదోన్నతి పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-04T05:44:24+05:30 IST

రాయలసీమ జోన్‌ పరిధిలోని ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతులు కల్పించడానికి ఎంపిక పరీక్షలను కర్నూలు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రం (డీటీసీ)లో గురువారం నిర్వహించారు.

ఏఎస్‌ఐలకు పదోన్నతి పరీక్షలు
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్న డీఐజీ, ఎస్పీ

కర్నూలు, డిసెంబరు 3: రాయలసీమ జోన్‌ పరిధిలోని ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతులు కల్పించడానికి ఎంపిక పరీక్షలను కర్నూలు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రం (డీటీసీ)లో గురువారం నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. జోన్‌ పరిధిలో కర్నూలులో 21, కడపలో 13, చిత్తూరులో 1, అనంతపురంలో 18, ఇంటెలిజెన్స్‌లో 2.. మొత్తం 55 మంది ఏఎస్‌ఐలు ఈ పదోన్నతి పరీక్షకు హాజరయ్యారు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ విభాగాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ పరీక్షలు జరిగాయి. ప్రతిభ కనబరిచిన వారికి ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తారు. ఏపీఎస్‌పీ కమాండెంట్‌ పి.రవిశంకర్‌, ఏఎస్పీ అడ్మిన్‌ జి.మధుసూదన్‌ రావు, ఏఆర్‌ ఏఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు వెంకట్రామయ్య, రమణ, యుగంధర్‌ బాబు, ఇలియాజ్‌ బాషా, డీఐజీ మేనేజర్‌ రత్నప్రకాష్‌, సీఐలు శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌, ఆర్‌ఐలు సురేంద్రారెడ్డి, సుధాకర్‌, ఎస్‌ఐ కె.మల్లికార్జున, ఆర్‌ఎస్‌ఐ కె.విజయ, నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:44:24+05:30 IST