ఉమ్మడి జిల్లాల ప్రకారమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-11-29T06:02:20+05:30 IST

ఉమ్మడి జిల్లాల ప్రకారమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టిఎస్‌ యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌ అన్నారు.

ఉమ్మడి జిల్లాల ప్రకారమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న సోమశేఖర్‌

- తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌ 

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 28 : ఉమ్మడి జిల్లాల ప్రకారమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టిఎస్‌ యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్‌ జిల్లా విస్తృతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులకు రెండవ శనివారం ఆప్షన్‌ హాలిడే వర్తింపజేయాలని, ఉద్యో గ, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్‌సీ ప్రకటించి జీవో విడుదల చేయాలన్నారు. వినూత్న విద్యా పథకాల పేరిట పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన కోసం సంవత్సరానికి 2000 కోట్లు ఖర్చు చేస్తామని ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన ప్రభుత్వం పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నామమాత్రపు వేతనాలతో నియమించిన స్వచ్‌ కార్మికులను మాత్రం రెండేళ్లుగా రీఎంగేజ్‌ చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో వాని, రాజయ్య, సీతారాములు, మల్లేశం, అనిల్‌రెడ్డి, సతీష్‌, ప్రణయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T06:02:20+05:30 IST