లైవ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రాప్ టైగర్

ABN , First Publish Date - 2020-08-22T00:47:25+05:30 IST

ప్రముఖ ఎలారా టెక్నాలజీస్‌ సంస్థకు చెందిన ప్రాపర్టీ టైగర్ వెబ్‌సైట్ తన తొలి ఆన్‌లైన్ లైవ్ ప్రాపర్టీ ఎక్స్‌పో ‘రైట్ టూ హోమ్’ను నేడు ప్రారంభించింది. ఈ ఎక్స్‌పోలో వివిధ ప్రముఖ...

లైవ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రాప్ టైగర్

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలారా టెక్నాలజీస్‌ సంస్థకు చెందిన ప్రాపర్టీ టైగర్ వెబ్‌సైట్ తన తొలి ఆన్‌లైన్ లైవ్ ప్రాపర్టీ ఎక్స్‌పో ‘రైట్ టూ హోమ్’ను నేడు ప్రారంభించింది. ఈ ఎక్స్‌పోలో వివిధ ప్రముఖ సంస్థలకు సంబంధంచిన ప్రజంటేషన్లను వీక్సించవచ్చని, అంతేకాకుండా వారి అవసరాలకు అనుగుణంగా ప్రాప్ టైగర్‌కు చెందిన నిపుణుల సలహాలను ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చని తెలిపింది. అవసరమైతే వారితో ప్రత్యేకంగా చర్చించవచ్చని సంస్థ వివరించింది. అంతేకాకుండా నేరుగా పూర్తయిన ఇళ్లను కొనుగోలు చేసేవారికి అప్పటికప్పుడు సరసమైన ఆఫర్‌లు కూడా లభిస్తాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం గురువారం మొదలైంది. ఈ రోజు కూడా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. వాటికి సంబంధించి దేశంలోని 9 ప్రముఖ నగరాల్లోని 80కి పైగా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రాం, హైదరాబాద్, కలకత్త, ఎంఎంఆర్, నోయిడా, పూణే నగరాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.

Updated Date - 2020-08-22T00:47:25+05:30 IST