గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ.7లక్షల ఆస్తినష్టం

ABN , First Publish Date - 2021-10-22T07:05:49+05:30 IST

మండలంలోని నేలమర్రి గ్రామంలో గురువారం గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ.7లక్షల ఆస్తినష్టం జరిగింది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ.7లక్షల ఆస్తినష్టం
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నగదు

మునగాల రూరల్‌, అక్టోబరు 21: మండలంలోని నేలమర్రి గ్రామంలో గురువారం గ్యాస్‌ సిలిండర్‌ పేలి రూ.7లక్షల ఆస్తినష్టం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కప్పల లక్షయ్య ఇంట్లో గ్యాస్‌ అంటించి ఉండగా, ఒక్కసారిగా మంటలు అంటుకుని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పూరిళ్లుతోపాటు రూ.6 లక్షల నగదు, ఇంటి సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్ష్మయ్య ఇటీవల తన పొలం అమ్ముకోగా రూ.9లక్షలు వచ్చాయి. వాటిని బీరువాలో భద్రపరచగా, అందులో రూ.6లక్షలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మయ్య కోరారు.  

Updated Date - 2021-10-22T07:05:49+05:30 IST